కేసీఆర్కు పట్టిన గతే..మోదీకి పడుతుంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్కు పట్టిన గతే..మోదీకి పడుతుంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు తెలుపుతూ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం (ఫిబ్రవరి 28)న హైదరాబాద్ లోని నిజాం కాలేజీ చౌరస్తా నుంచి నెక్లెక్ రోడ్ వరకు కిసాన్ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు ఖండిస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు. ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఉద్యమానికి మద్దతుగా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.  మోదీ హటావో.. కిసాన్ కు బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం వెంటనే స్పందించి  రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. 

కిసాన్ సంఘీభావ ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తుంటే.. ఏమాత్రం స్పందించిన కేంద్రంంలోని బీజేపీ ప్రభుత్వం.. సంకల్ప యాత్రల పేరుతో తిరుగుతోందని విమర్శించారు. రైతులు సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. అప్పుడూ ఇప్పుడూ..కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలిచిందన్నారు. పదేళ్ల మోదీ పాలనలో దేశ రైతాంగం నిర్వీర్యం అయిందన్నారు.

కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. మద్దతు ధర పై చట్ట బద్దత కల్పించడానికి కమిటీ వేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించి పదేళ్లు అవుతున్నా ఇప్పటికు కమిటీ వేయలేదని విమర్శించారు. 

ప్రధాని మోదీ విధానాలు దేశానికి ప్రమాదకరంగా ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ఇచ్చారు. కానీ ఆయన సిఫారసుల అమలు చేయాలని రైతులు అడుగుతుంటే వారిని కాల్చి చంపుతున్నారని జీనవ్ రెడ్డి విమర్శించారు. 

ALSO READ :- నేను రాజీనామా చేయ లేదు.. ఐదేళ్లు ఉంటా : హిమాచల్ సీఎం సుఖ్వీందర్

కాంగ్రెస్ హయాంలో రైతాంగం సంక్షేమానికి అనేక పునాదులు పడ్డాయని జీవన్ రెడ్డి అన్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. రైతులను, వ్యవసాయ విధానం, ప్రభుత్వ రంగ  సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందని జీవన్ రెడ్డి అన్నారు.

పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ చేతుల్లో తాకట్టు పెట్టిందని విమర్శించారు. కేసీఆర్ కు ఎట్లా మూడిందో.. మోదీకి కూడా అలాగే మూడిందని అన్నారు జీవన్ రెడ్డి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తే మోదీకి ప్రజలను తగిన బుద్ధి చెపుతారని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు.