గురుగ్రామ్: ఒక స్టూడెంట్ తన క్లాస్ మేట్ ను ఇంటికి రప్పించుకుని అతడిపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాల్పులు జరిపిన బాలుడితో పాటు అతడికి సహకరించిన మరో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఈ ఘటన జరిగింది.
సెక్టార్ 48 ఏరియాలోని విలాసవంతమైన హౌసింగ్ సొసైటీకి చెందిన కొందరు విద్యార్థులు స్థానిక ప్రైవేటు స్కూల్లో 11 వ తరగతి చదువుతున్నారు. శుక్రవారం రాత్రి17 ఏండ్ల క్లాస్‌మేట్‌ను ఒక విద్యార్థి కలుద్దామని పిలిచాడు. అతడు అంగీకరించకపోయేసరికి బలవంత పెట్టాడు. బాధితుడు ఖేర్కి దౌలా టోల్ ప్లాజాకు వెళ్లగానే నిందితుడు కలిశాడు.
అనంతరం మరొక స్నేహితుడితో కలిసి సెక్టార్ 48లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. తన తండ్రికి చెందిన లైసెన్స్ పిస్టల్ తో క్లాస్ మేట్ పై కాల్పులు జరిపాడు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు.
