
న్యూఢిల్లీ:కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ (సీ అండ్ ఐ) రెన్యువబుల్ఎనర్జీ ప్రొవైడర్ క్లీన్‌మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా రూ. 5,200 కోట్లను సేకరించడానికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను అందజేసింది.
ప్రతిపాదిత ఇష్యూలో రూ. 1,500 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూ, ప్రమోటర్లు, పెట్టుబడిదారుల నుంచి రూ. 3,700 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటాయి. ఫౌండర్ కుల్‌దీప్ ప్రతాప్ జైన్ రూ. 321.37 కోట్లు, బీజీటీఎఫ్ వన్ హోల్డింగ్స్ (డీఐఎఫ్సీ) లిమిటెడ్ రూ. 1,970.83 కోట్లు, కేఈఎంపీఐఎన్సీ ఎల్ఎల్పీ రూ. 225.61 కోట్లు, ఆగ్మెంట్ ఇండియా ఐ హోల్డింగ్స్ ఎల్ఎల్సీ రూ. 991.94 కోట్లు, డీఎస్డీజీ హోల్డింగ్స్ ఏపీఎస్ రూ. 190.25 కోట్ల షేర్లను అమ్ముతాయి.
ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే రూ. 1,125 కోట్లను అప్పులు తిరిగి చెల్లించడానికి ఉపయోగించనున్నారు. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాడతారు.