
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ చర్చలో అమెరికన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ ఊహించని విధంగా లక్ష్యంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-–పాకిస్తాన్ సీజ్‌ఫైర్‌ను తానే సాధించానని చేసిన వాదనలను ఖండించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే, భారత్‌లో మెక్‌డొనాల్డ్స్‌ను మూసేయాలని అన్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసినప్పుడు ట్రంప్ తన జోక్యంతో సీజ్‌ఫైర్ జరిగిందని 26 సార్లు చెప్పారని హుడా ఆరోపించారు. భారత్ మాత్రం పాకిస్తానే శాంతి కోసం సంప్రదించిందంటున్నది. అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్.. ట్రంప్ వాదనలను తోసిపుచ్చుతున్నారని అన్నారు. అయినా, కేంద్రం స్పష్టంగా ట్రంప్‌ను ఖండించలేదని విమర్శించారు.
‘‘అమెరికా భారత్, పాకిస్తాన్‌ను ఒకే స్థాయిలో చూడడం సరికాదు. లవ్, ట్రేడ్ఒకే వైపు నడవవు’’ అని హుడా అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ హుడాను ఎద్దేవా చేసింది. హుడా మాటలు విని ఆ వెనకే ఉన్న ప్రియాంకా గాంధీ నవ్వుతున్నారని.. ఆయనది
‘‘హాస్యాస్పద వాదన’’ అని విమర్శించింది.