ఇండియా–చైనా మధ్య పరిస్థితిని మానిటర్‌‌ చేస్తున్నాం

ఇండియా–చైనా మధ్య పరిస్థితిని మానిటర్‌‌ చేస్తున్నాం
  • వెల్లడించిన అమెరికా

వాషింగ్టన్‌: ఇండియా – చైనా బార్డర్‌‌లో నెలకొన్ని పరిస్థితిపై క్లోజ్‌గా మానిటర్‌‌ చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. రెండు దేశాలు సామరస్యంగా మాట్లాడుకుని పరిస్థితులను చక్కదిద్దుకోవాలని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. లడాఖ్‌లో ప్రాణాలు కోల్పోయిన 20 మంది జవాన్లకు ఈ సందర్భంగా సంతాపం ప్రకటించింది. సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అమెరికా తరఫున పూర్తి సహకారం అందిస్తామని, శాంతియుత వాతావరణం నెలకొల్పే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని మోడీ మధ్య ఈ నెల 2న జరిగిన సంభాషణలో కూడా బార్డర్‌‌ అంశంపై చర్చలు జరిగాయి. చైనా, ఇండియా మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమే అని గతంలో కూడా ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియా– చైనా బోర్డర్‌‌లో గత కొద్ది రోజులుగా ఉన్న పరిస్థితులు సోమవారం ఉద్రిక్తంగా మారాయి. లడాఖ్‌లో మన సైనికులపై చైనా ఆర్మీ దాడి ఆకస్మికంగా దాడి చేయడంతో 20 మంది అమరులయ్యారు. వారిలో తెలంగాణలోని సూర్యపేటకు చెందిన కర్నల్‌ సంతోష్‌ కుమార్‌‌ ఉన్నారు.