క్రీడల్లో ఇతర దేశాలకు పోటీగా నిలిచాం: కిషన్ రెడ్డి

క్రీడల్లో ఇతర దేశాలకు పోటీగా నిలిచాం: కిషన్ రెడ్డి

క్రీడల్లో ఇతర దేశాలకు మనదేశం పోటీ ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‭లో నిర్వహించిన.. ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ సికింద్రాబాద్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ క్రీడాకారులను సత్కరించారు. క్రికెట్, కబడ్జీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. సుమారు 7వేల మంది క్రీడాకారులు ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో అమ్మాయిల ప్రదర్శన చాలా బాగుందని కిషన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఏదైనా క్రీడను ఎంచుకుని దేశానికి పేరు తీసుకురావాలని కిషన్ రెడ్డి కోరారు. 

దేశ క్రీడల్లో ఓడిపోయిన వారిని వెన్నుతట్టి మోడీ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు అన్నారు. దేశంలో ఆట గెలిచే విధంగా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి చూపించారని ఆయన ప్రశంసించారు. క్రీడల్లో భారత దేశాన్ని నెంబర్ వన్ చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కబడ్డీ నేషనల్ గేమ్ అవుతుందన్నారు. వ్యాధులకు దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలని మురళీధర్ రావు చెప్పారు.