సెప్టెంబర్ 25 నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్ మూసివేత

సెప్టెంబర్ 25 నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్ మూసివేత

హైదరాబాద్: కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో క్రయవిక్రయాలు ఈ నెల 25 నుండి నిలిపేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, డైరెక్టర్లు వెల్లడించారు. ఈ మార్కెట్ ను బంద్ చేసి అక్టోబర్ 1వ తేదీ నుండి బాటాసింగరంలోని లాజిస్టిక్ పార్క్ లో ప్రారంభిస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న 22 ఎకరాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి కట్టడం జరుగుతుందన్నారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ ప్రాంతాన్ని వైద్య ఆరోగ్యశాఖకి అప్పగించడం జరుగుతుందన్నారు.

178 ఎకరాల్లో కోహెడ లో నిర్మిస్తున్న మార్కెట్ పనులు  డిపిఆర్ కు ఇవ్వడం జరిగింది.. అది సమయం పట్టేట్లు ఉండటంతో తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్ పార్క్కి తరలించడం జరుగుతోందన్నారు. ఈనెల 25వ తేదీ రాత్రి నుండి కొత్తపేట మార్కెట్ బంద్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చే రైతులు ముందుగానే మార్కెట్ కు చేరే విధంగా చూసుకోవాలని, రైతులు, ఏజెంట్లు మరియు హమాలీలు సహకరించాలని కోరారు. అక్టోబర్ 1 నుండి బాటసింగారంలో  క్రయ విక్రయాలు జరుగుతాయని, తమ వద్ద ఉన్న 341 మంది కమిషన్ ఏజెంట్లకి అక్కడ లాజిస్టిక్ పార్కులో స్థలాన్ని కేటాయించడం జరిగిందని వివరించారు.