ఢిల్లీలో ప్ర‌భుత్వ, ప్రైవేటు స్కూళ్లు మూసివేత: మ‌నీష్ సిసోడియా

ఢిల్లీలో ప్ర‌భుత్వ, ప్రైవేటు స్కూళ్లు మూసివేత: మ‌నీష్ సిసోడియా

కరోనా వ్యాప్తి కారణంగా ఢిల్లీలో స్కూళ్ల‌ను త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు మూసివేస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మ‌నీష్ సిసోడియా తెలిపారు. రెగ్యుల‌ర్‌గా క్లాసులు నిర్వ‌హించేందుకు విద్యార్థులు త‌ల్లితండ్రులు ఆస‌క్తిగా లేర‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వ, ప్రైవేటు స్కూళ్ల‌ను మూసివేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దేశ‌రాజ‌ధానిలో మ‌ళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. యూనివర్శిటీ కింద ఉన్న కాలేజీల్లో సీట్ల సంఖ్య 1330కి పెంచిన‌ట్లు మంత్రి సిసోడియా తెలిపారు.