ఉత్తరాఖండ్‌లో వర్షాల బీభత్సం: వరదల్లో చిక్కుకున్న రుద్రప్రయాగ్, కొట్టుకుపోయిన వంతెనలు...

ఉత్తరాఖండ్‌లో వర్షాల బీభత్సం: వరదల్లో చిక్కుకున్న రుద్రప్రయాగ్, కొట్టుకుపోయిన వంతెనలు...

ఉత్తరాఖండ్‌లో   వరదల భీభత్సం ఇంకా ఆగలేదు. చమోలి జిల్లాలో మరోసారి మేఘాలు ఒక్కసారిగా విరిగిపడటంతో (cloud burts) విధ్వంసం సంభవించింది. దింతో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లు సమాచారం, వెంటనే అధికారులు  సహాయ, రక్షణ చర్యలను చేపట్టింది.  కేదార్‌ఘాటిలోని లావారా గ్రామంలో ఓ వంతెన కొట్టుకుపోవడంతో చెనాగడ్ ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా మారింది. దీనితో పాటు రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకనంద, మందాకిని నదిలోకి వరద నీరు చేరడంతో ఆ నీరు ఇళ్లలోకి ప్రవేశించాయి. 

మరోవైపు ఇళ్లకు దగ్గరలో ఉన్న పశువుల పాక  శిధిలాల కింద కూరుకుపోగా, అందులో 15 నుండి 20 పశువులు చిక్కుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ట్విట్టర్‌లో ఈ సమాచారాన్ని అందించారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని బసుకేదార్ ప్రాంతంలోని బడేత్ దుంగర్ టోక్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో మేఘాలు విరిగిపడటంతో శిథిలాలు విరిగిపడ్డాయి. దింతో కొన్ని కుటుంబాలు ఎక్కడికక్కడే చిక్కుకున్నాయి. స్థానిక అధికారులు సహాయక, రక్షణ పనులను వేగంగా  చేయాలని విపత్తు కార్యదర్శి, జిల్లా ఆధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకనంద, మందాకిని సంగమం వద్ద నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది. అలకనంద నది ప్రమాద స్థాయిని దాటింది, దింతో తీవ్రమైన వరద ముప్పు  పరిస్థితి ఏర్పడింది. నది నీళ్లు ఇళ్లల్లోకి చేరుకోగా ఇళ్లను ఖాళీ చూపించింది. రుద్రప్రయాగ్‌లోని హనుమాన్ ఆలయం కూడా నదిలో మునిగిపోయింది. కేదార్‌ఘాటిలోని లారా గ్రామంలో ఓ వంతెన వరదల ప్రవాహంలో కొట్టుకుపోయింది. చెనాగడ్ ప్రాంతంలో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది.

మందాకిని నది నీటి మట్టం 2013 నాటి భయంకర పరిస్థితిని గుర్తు చేస్తోంది. భారీ వర్షాల దృష్ట్యా రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్, పిథోరగఢ్ జిల్లాల్లో ఈరోజు స్కూలుకు సెలవు ప్రకటించారు. హరిద్వార్‌లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ భారీ వర్షాల దృష్ట్యా ఈరోజు అన్ని స్కూల్స్,  అంగన్‌వాడీ సెంటర్లను  మూసివేయాలని సూచంచారు. 

ALSO READ : హైదరాబాదీలకు బిగ్ అలర్ట్

ఉత్తరాఖండ్‌లో నిరంతర భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. లతా గ్రామం సమీపంలో అకస్మాత్తుగా కొండ చరియలు కూలిపోవడంతో చమోలి జిల్లాలోని భారత్-చైనా సరిహద్దును కలిపే మలారి జాతీయ రహదారి మూసేసారు, దింతో చాల  గ్రామాలకి రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం రోడ్డును తెరిచే పనులు జరుగుతున్నాయి.

డెహ్రాడూన్, బాగేశ్వర్, నైనిటాల్, పిథోరగఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఆగస్టు 29న వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోయే రెండు రోజులు ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావించి రాష్ట్రం మొత్తం ఎల్లో అలర్ట్‌లో ఉంచారు.