వంటింటి చిట్కాలు : చక్కెర డబ్బాలో లవంగాలు వేయాలి

వంటింటి చిట్కాలు : చక్కెర డబ్బాలో లవంగాలు వేయాలి
  • బెల్లం, చక్కెర వంటి తీపిపదార్థాలు ఎక్కడ ఉన్నా చీమలు పడతాయి.
  • అందుకని చక్కెర డబ్బాకి చీమలు పట్టకుండా... ఆ డబ్బాలో రెండు లేదా మూడు లవంగాలు  వేయాలి. 
  • ఈ సీజన్​లో పచ్చళ్లు తొందరగా పాడవుతాయి. అందుకని పచ్చళ్లను గాజు సీసాలో నిల్వ చేయాలి.
  • పచ్చడి మీద  నూనె తేలేలా ఉండాలి. పన్నీర్​ కొన్నిసార్లు ​ పుల్లగా, చేదుగా అవుతుంది.
  • దాంతో కూర అంత రుచి ఉండదు. అలాకాకూడదంటే. పన్నీర్​ని నీళ్లలో వేసి, ఫ్రిజ్​లో పెట్టాలి. ఇలాచేస్తే పన్నీర్ టేస్ట్​ మారదు. పైగా మెత్తగా కూడా ఉంటుంది.
  • పాత, కొత్తబియ్యం గుర్తుపట్టడం కొందరికి కష్టం. అందుకు సింపుల్ టిప్​ ఒకటి ఉంది. అదేంటంటే... నాలుగైదు బియ్యం గింజల్ని నోట్లో వేసుకుని నమలాలి. అవి పళ్లకు అంటుకుపోతే పాత బియ్యం.