రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారితీస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఓ అధికారిని తన కార్యాలయంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదని, తెలంగాణ రాష్ట్రంలో జరగడం బాధాకరమని ఆయన అన్నారు. MRO విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, దీని పై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని భట్టి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. మృతిచెందిన విజయరెడ్డి, డ్రైవర్ గురునాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని భట్టి తెలిపారు.

