రాష్ట్రంలో ప్రతి క‌రోనా చావుకు కేసీఆరే బాధ్యుడు

రాష్ట్రంలో ప్రతి క‌రోనా చావుకు కేసీఆరే బాధ్యుడు

సీఎం కేసీఆర్ అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి.. కరోనా మీదనే దృష్టి పెట్టాలని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్ర‌మార్క‌. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళిన కరోనా పేషెంట్ లు ఏడుస్తున్నార‌ని, సదుపాయాలు లేవని వీడియో ల ద్వారా చెబుతున్నా.. కేసీఆర్ పెట్టించుకోవటం లేదని ఆయ‌న అన్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన సీఎల్పీ నేత.. రాష్ట్రంలో ప్రతి క‌రోన చావుకు కేసీఆరే బాధ్యుడని అన్నారు. ఆయ‌న‌కు ఆదాయం పైన ఉన్న దృష్టి, ప్రజల ప్రాణాలపై లేదని ఆరోపించారు.

“రాష్ట్రంలో బెల్ట్ షాపులు రాజ్యం ఏలుతున్నాయి. ఏ గ్రామంలో చూసిన బెల్ట్ షాపులే ఉన్నాయి. వైన్ షాపుల వద్ద కూడా డిస్టెన్స్ మెయింటన్ చేయడం లేదు. దీంతో వైరస్ పెరుగుతుంది” అని భ‌ట్టి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైద్య సిబ్బంది నియామకం జరగలేదని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 700 మంది డాక్టర్ ల కొరత ఉందని, ప్ర‌భుత్వం రిక్రూట్ చేయడం లేదన్నారు. కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి అరకొర జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కరోనా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది వేతనాలు రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు

నీటి పారుదల శాఖను కేసీఆర్ భ్ర‌ష్టు పట్టించాడన్నారు విక్ర‌మార్క‌. ఏడేళ్ల క్రితం రిటైర్డ్ అయిన ఉద్యోగితో ఇరిగేషన్ నిధులను ఖర్చు చేయిస్తున్నారని మండిప‌డ్డారు. ఆ ఉద్యోగి కేసీఆర్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నాడని, ఆయన కు బాధ్యత లేదని అన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో బిజీ నెస్ రూల్స్ పాటించడం లేదన్నారు. బిజినెస్ రూల్స్ పాటించకపోవడానికి సీఎస్ సోమేశ్ కుమార్ ను కూడా బాధ్యుడిని చేసి, ఇరిగేషన్ లపై జరుగుతున్న అక్రమాలపై అవసరమైతే కోర్టులకు వెళ్తామని అన్నారు.