కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యం : భట్టి విక్రమార్క

కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యం : భట్టి విక్రమార్క

ఎర్రుపాలెం, వెలుగు : కాంగ్రెస్ పాలనతోనే సంక్షేమం పథకాలు, అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎల్పీ లీడర్ నేత భట్టి విక్రమార్క చెప్పారు. బుధవారం ఎర్రుపాలెం మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తొమ్మిదన్నరేండ్లుగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారని ఆరోపించారు. విద్య, వైద్యం, రేషన్ కార్డులు లేవని,పేదలకు  ఇంటి కల సహకారం కాలేదనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. 

మరో15 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే మధిర నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు దోమందుల సామేలు ఆయనకు మద్దతు తెలిపారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భట్టి సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.