రోజు ఒక్కో టెలీ కాలర్ 300 కాల్స్.. బీ కేర్ ఫుల్

రోజు ఒక్కో టెలీ కాలర్ 300 కాల్స్.. బీ కేర్ ఫుల్
ఆర్బీఐ నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా మైక్రో ఫైనాన్స్ యాప్స్  రన్ అవుతున్నాయన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపుల కేసులో హైదరాబాద్ సిటీ పోలీస్, సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ చేశారు. మొత్తం పదహారు కేసులు నమోదయ్యాయన్నారు. లోన్ రికవరీ సమయంలో వేధింపులకు పాల్పడుతుండటంతో లోన్ తీసుకున్న వారు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఢిల్లీలో రెండు లొకేషన్లలో ఉద్యోగ్ విహార్, గురుగావ్, హైదరాబాదు లో మూడు ప్రాంతాల్లో రైడ్ చేశామన్నారు. నాలుగు కంపెనీలను లియూఫాంగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ టెక్నాలజీ, హాట్ ఫుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, , పిన్ ప్రింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, నాబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను గుర్తించామన్నారు. రోజు ఒక్కో టెలీ కాలర్ 300 వరకు కాల్స్ చేస్తున్నారన్నారు. ఇది కేవలం ఢిల్లీతో కాకుండా జకర్తా, ఇండోనేషియాకు కూడా సంబంధం ఉందన్నారు. చైనాకు సంబంధించిన లింకులు కూడా ఉన్నాయన్నారు. ఇండోనేషియా, చైనాతో ఉన్న లింకులపై విచారణ చేస్తున్నామన్నారు. ఢిల్లీ సోదాల్లో చైనాకు సంబంధించిన పాస్ పోర్ట్ కూడా లభించిందన్నారు. హైదరాబాద్ లో 600 , గుర్ గావ్ లో 500 మంది టెలికాలర్లు పని చేస్తున్నారన్నారన్నారు. ఇందులో 11 మందిని అరెస్టు చేశామన్నారు.  మొత్తం 700 ల్యాప్‌టాప్ లు, సర్వర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేశామన్నారు. ఇదంత మోసంతో కూడుకున్నది కాబట్టి ఈ యాప్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.  ఏదైనా ఇబ్బంది ఉంటే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.