గతం గుర్తుచేసుకుంటూ సీఎం కన్నీళ్లు

గతం గుర్తుచేసుకుంటూ సీఎం కన్నీళ్లు

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన స్థానంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలను మోహన్ మార్కమ్ తీసుకుంటున్న కార్యక్రమంలో .. ఆయన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు.

ఛత్తీస్ గఢ్ పీసీసీ చీఫ్ గా పనిచేస్తూ.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు బఘేల్. ఆయన ముఖ్యమంత్రి కావడంతో..  మార్కమ్ కు పీసీసీ పగ్గాలు అప్పగించింది హైకమాండ్. మార్కమ్ పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. గత ఐదేళ్లుగా తనతో పనిచేసిన నాయకులందరికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై ఏడ్చారు. దీంతో సభలో ఉద్వేగ వాతావరణం కనిపించింది.