తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..

ఏపీలో మొంథా తుఫాన్ బీభత్సం సృఙిష్టిస్తున్న సంగతి తెలిసిందే... మంగళవారం ( అక్టోబర్ 28 ) రాత్రి తుఫాన్ తీరం దాటిన క్రమంలో ఏపీలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తుఫాన్ హెచ్చరికలు జారీ  అయినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నుంచి గ్రామస్థాయిలో  సర్పంచులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం చంద్రబాబు.

బుధవారం ( అక్టోబర్ 29 ) అధికారులతో కలిసి ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరిన చంద్రబాబు బాపట్ల, పల్నాడు, కృష్ణ, కోనసీమ, ఏలూరు, జిల్లాలో ఏరియల్సర్వే నిర్వహించారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడరేవుల వరకు ఏరియల్ సర్వే నిర్వహించారు చంద్రబాబు.కోనసీమ జిల్లా అల్లవరం, మండలం, ఓడరేవులలో ల్యాండ్ అయ్యారు సీఎం చంద్రబాబు.

తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం: సీఎం చంద్రబాబు ​​​​​

అనంతరం ఓడరేవుల నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీటమునిగిన పంట పొలాలను పరిశీలించారు చంద్రబాబు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. విద్యుత్ ను యుద్ధప్రాతిపదికన పునరుద్దరించామని... ఈదురుగాలుల వల్ల భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. అన్ని జిల్లాల్లో వరి. వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు చంద్రబాబు. తుఫాన్ ను సమర్తవంతంగా ఎదుర్కొన్నామని.. అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేశామని అన్నారు చంద్రబాబు.

►ALSO READ | మొంథా తుఫానుపై మంత్రి నారా లోకేష్ సమీక్ష.. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశం