మొంథా తుఫానుపై మంత్రి నారా లోకేష్ సమీక్ష.. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశం

మొంథా తుఫానుపై మంత్రి నారా లోకేష్ సమీక్ష.. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశం

మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలతో పాటు ఇతర అన్ని జిల్లాల్లో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాను తీవ్రతపై ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం (అక్టోబర్ 29) అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. 

తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి లోకేష్. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ఆరా తీశారు.  ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని అధికారులు వివరించారు.

►ALSO READ | వద్దన్నా వినకుండా వెళ్లాడు.. ఖమ్మం జిల్లాలో చూస్తుండగానే వాగులో డ్రైవర్తో సహా కొట్టుకుపోయిన డీసీఎం

ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.