AP News: కేన్సర్ తో బాధపడుతున్న టీడీపీ అభిమాని... ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

AP News:  కేన్సర్ తో బాధపడుతున్న టీడీపీ అభిమాని...  ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు కేన్సర్​ తో బాధపడుతున్న  టీడీపీ కార్యకర్త  ఆకుల కృష్ణను  వీడియో కాల్​ ద్వారా పరామర్శించారు.  రాజమండ్రి రూరల్​ నియోజకవర్గం... మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచి టీడీపీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఆయన కొంతకాలంగా కేన్సర్​ వ్యాధితో బాధపడతున్నాడు. 

కృష్ణ ఆరోగ్యం  రోజు రోజుకు క్షీణిస్తుండటంతో క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఉందని  తెలిపారు.  ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి పరామర్శించారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన సీఎం... ధైర్యంగా ఉండాలని అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు  ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.