గత ఏడాది నుంచి ఏపీలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

గత ఏడాది నుంచి ఏపీలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

శుక్రవారం ( సెప్టెంబర్ 5 ) వైజాగ్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం జరుగుతుందని.. మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉందని అన్నారు.  గత ఏడాది నుంచి ఏపీలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు సీఎం చంద్రబాబు.

మీడియేషన్ అంశం భారత్ కు కొత్తకాదని... తరాలుగా మనకు అందుబాటులో ఉందని అన్నారు.పురాణాల్లో శ్రీకృష్ణుడు ఓ సమర్ధవంతమైన మీడియేటర్ గా వ్యవహరించారని.. గతంలో మన పూర్వీకులు, గ్రామపెద్దలు సమర్ధంగా మీడియేషన్ ప్రక్రియను నిర్వహించేవారని అన్నారు చంద్రబాబు.విశాఖపట్నంలో జ్యుడీషియల్, మధ్యవర్తిత్వ రంగాలపై చారిత్రాత్మక కాన్ఫరెన్స్ నిర్వహించటం సంతోషంగా ఉందని అన్నారు చంద్రబాబు.

►ALSO READ | గ్రహణం రోజు ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆలయం ఇదే..!

 ప్రజాస్వామ్యంలో భారతీయ న్యాయవ్యవస్థ ఓ మూల స్తంభం అని.. రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాన్ని కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ అని అన్నారు.కొన్ని సమయాల్లో కాస్త ఆలస్యమైనా న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతీ పౌరుడికీ ఉందని అన్నారు చంద్రబాబు. భారత్ అత్యంత వేగంగా సంస్కరణల్ని అమలు చేస్తోందని.. కంపెనీలు, వ్యవస్థలు వస్తున్న నేపథ్యంలో వివాదాల పరిష్కారానికి మీడియేషన్ లాంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి రావాలని అన్నారు చంద్రబాబు.

ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టం రావాలని..  సులభంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలని అన్నారు సీఎం చంద్రబాబు.