ఎక్కువమంది పిల్లల్ని కంటేనే నిజమైన దేశభక్తి: సీఎం చంద్రబాబు

ఎక్కువమంది పిల్లల్ని కంటేనే నిజమైన దేశభక్తి: సీఎం చంద్రబాబు

జనాభా నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. అప్పట్లో జనాభా నియంత్రణను ప్రోత్సహించి నష్టపోయామని.. ఇప్పుడు జనాభా పెరుగుదల కోసం అందరు కృషి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ముగ్గురికంటే ఎక్కువమంది పిల్లల్ని కంటేనే నిజమైన దేశభక్తి ఉన్నట్లని అన్నారు చంద్రబాబు. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తాం అని చెప్పి రూ.15 వేలు ఇస్తున్నామని.. జనాభా పెరుగుదల కోసం అందరు కృషి చేయాలని అన్నారు. 

చైనా జనాభా నియంత్రణ వలన చాలా నష్ట పోయిందని.. జనాభా పెరుగుదల కోసం అందరం మాట్లాడాలని అన్నారు చంద్రబాబు. దక్షిణ భారత దేశంలో నియోజక వర్గాల సీట్లు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నాయిని అన్నారు.దానికి కారణం జనాభా నియంత్రణ చర్యలేనని అన్నారు చంద్రబాబు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. 

Also Read : టీటీడీలో దళారీల దందా.. 

తాను మహిళా పక్షపాతినని.. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని, మహిళలకు ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారని అన్నారు. నా తల్లి కట్టెల పొయ్యి మీద అన్నం వండి ఇబ్బంది పడింది..అందుకే నా ఆడపడుచులకు ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చానని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించారని అన్నారు.శక్తి సామర్ధ్యాల్లో మహిళలలు ఏమాత్రం  తక్కువ కాదని.. జనాభా లో 50 శాతం మహిళలు ఉన్నారని అన్నారు. ఆర్టిసీ బస్సులో కండక్టర్లుగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించానని అన్నారు చంద్రబాబు. 

ఒకప్పుడు జనాభా నియంత్రణ అన్నాం కానీ.. ఇప్పుడు జనాభా నిర్వహణ అంటున్నామని అన్నారు. తిరిగి ఉమ్మడి కుటుంబాలు రావాలని.. దాని కోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని అన్నారు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే విధంగా పథకాలు తీసుకువస్తామని.. పాపులేషనే మనకు ఒక పెద్ద ఆస్తి అని అన్నారు చంద్రబాబు. ఇప్పుడు చాలా దేశాల్లో వయసు మళ్ళిన వారే అధికంగా ఉన్నారని.. ఇప్పటి నుంచి భావి తరాల భవిష్యత్ కోసం, జనాభా నిర్వహణ కోసం అందరు సహకరించాలని అన్నారు చంద్రబాబు.