తిరుమల: టీటీడీలో దళారీల దందా.. టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేరుతో టికెట్ల మోసం..

తిరుమల:    టీటీడీలో దళారీల దందా.. టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేరుతో టికెట్ల మోసం..

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో జరుగుతున్న మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. అమాయక భక్తులను నిలువునా దోచుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా.. మరో ఘరానా నకిలీ టికెట్ల మోసం వెలుగులోకి వచ్చింది.  TTD సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేరుతో  వంశీ అనే వ్యక్తి మోసాలు  పాల్పడినట్లు గుర్తించారు. వీఐపీ బ్రేక్​ దర్శనం.. సేవా టికెట్ల పేరుతో  రూ.50 వేలు  మోసగాడు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే పీఏ జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ALSO READ : మెడికల్ విద్యార్థినిలను వేధించిన వారిపై చర్యలు తీసుకుంటాం


దళారీలు శ్రీవారి భక్తులను మోసం చేసేందుకు రకరకాల కొత్త మార్గాలను ఉపయోగించి దోచుకుంటున్నారు. ఇటువంటి మోసాలపై టీటీడీ, పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ.. భక్తులు బయటి వ్యక్తులను నమ్మి మోసపోతూనే ఉన్నారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ.. దళారుల ప్రలోభాలకు లోనై అమాయక భక్తులు తమ సొమ్మును, సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.