కాకినాడ జీజీహెచ్ కేస్: మెడికల్ విద్యార్థినిలను వేధించిన వారిపై చర్యలు తీసుకుంటాం

కాకినాడ జీజీహెచ్ కేస్: మెడికల్ విద్యార్థినిలను వేధించిన వారిపై చర్యలు తీసుకుంటాం

కాకినాడ జీజీహెచ్​మెడికల్​ స్టూడెంట్స్​పై వేధింపుల కేసు విషయాన్ని సీఎం చంద్రబాబు ఆరాతీశారు.  వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారుల నివేదికను చంద్రబాబుకు అందజేశారు. వైద్య విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన నిందితులపై కఠిన చర్యలకు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.  

కాకినాడ జీజీహోచ్​ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్ గా పనిచేస్తున్న కళ్యాణ్​ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈనెల 9వ తేదీన విద్యార్థినుల ఫిర్యాదు చేశారు.  ఈ ఘటనను విచారించేందుకు   అదే రోజు  కమిటీని నియమించి.. విచారణ చేపట్టారు. నిన్న( జులై 10)  రాత్రి వరకు విద్యార్థినులతో మాట్లాడిన విచారణ కమిటి  నివేదిక సిద్దం చేసింది. చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది.  విచారణ కమిటి నివేదిక ఆధారంగా విద్యార్థులను వేధించిన మెడికల్​ కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  నిందితులపై పోలీసులకు విచారణ కమిటి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.