మహానాడు- 2026 ప్రారంభించిన చంద్రబాబు 

మహానాడు- 2026 ప్రారంభించిన చంద్రబాబు 

టీడీపీ మహానాడు 2026 ప్రారంభమైంది. బుధవారం ( మే 27 ) అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు ప్రారంభించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ్టి ( మే 27 ) నుంచి రెండు రోజుల పాటు జరగనుంది మహానాడు. పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా ఈ ఏడాది మహానాడు వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది స్త్రీ శక్తి థీమ్ తో వర్చువల్ గా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

మహానాడు ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.1,875 క్లస్టర్ల వేదికగా మాహానాడు జరగుతోందని.. లక్షలాదిమంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారని అన్నారు చంద్రబాబు. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం కారణంగా  మహనాడును వర్చువల్‌గా నిర్వహిస్తున్నామని అన్నారు.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ టీడీపీ అని..సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను టీడీపీ పరిచయం చేసిందని అన్నారు. జండర్ ఈక్వాలిటీ, సామాజిక సమస్యలపై టీడీపీ పోరాడిందని..విజన్ పాలిటిక్స్‌కు నాంది పలికిందని అన్నారు చంద్రబాబు టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలేనని.. ప్రతి అడుగు సంచలనమేనని అన్నారు చంద్రబాబు.