మెంథా తుఫాన్ పై చంద్రబాబు అధికారులతో సమీక్ష

  మెంథా తుఫాన్ పై చంద్రబాబు అధికారులతో సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌కు మొంథా తుఫాను పొంచివున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు  ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష   నిర్వహించారు. మొంథా తుఫాను కారణంగా రెండురోజుల పాటు  గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి  కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.  కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో  మంత్రులు లోకేష్, అనిత, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్​ పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం చంద్రబాబుకు ఫోన్​చేసిన ప్రధాని   పూర్తి స్థాయిలో కేంద్ర సాయం  ఉంటుందని తెలిపారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్‌కు సీఎం సూచించారు.