ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్సాహంగా సీఎం కప్ క్రీడా పోటీలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్సాహంగా సీఎం కప్ క్రీడా పోటీలు

తాడ్వాయి/సదాశివనగర్​/వర్ని/బోధన్ : ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.  గురువారం తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వాలీబాల్​పోటీలను ఎంపీడీవో సాజిత్ అలీ, సదాశివనగర్ మండల స్థాయి ఖోఖో పోటీలను సర్పంచ్​ ఎడ్ల నర్సింహులు, హెచ్​ఎం దుబ్బాక శేఖర్, వర్ని మండలం ఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌పురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​,అథ్లెటిక్స్​ పోటీలను ఎంపీడీవో వెంకటేశ్వర్లు , బోధన్ మండలం కల్దుర్కిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​,అథ్లెటిక్స్​ పోటీలను ఎంఈవో నాగయ్య క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​,అథ్లెటిక్స్​ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులను అందజేశారు.