ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల సీఎం కప్ టార్చ్ ర్యాలీ

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల సీఎం కప్ టార్చ్ ర్యాలీ

రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే సీఎం కప్ - సెకండ్ ఎడిషన్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌‌కు సంబంధించి టార్చ్ ర్యాలీ గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, పాఠశాల విద్యార్థులు, పీఈటీలు,  స్థానిక ప్రజలు పాల్గొని ర్యాలీని సక్సెస్​ చేశారు.

 అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా యువజన  క్రీడా అధికారి పరంధామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, దమ్మపేట ఎంఈఓ కి సర లక్ష్మి, మధిరలో జిల్లా యువజన  క్రీడా అధికారి టి. సునీల్ రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్  కూసుమంచిలో మంత్రి పొంగులేటి క్యాంపు ఆఫీస్​ ఇన్​చార్జి భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయా చోట్ల పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. - ‌‌‌‌ నెట్​వర్క్, వెలుగు