
కడెం,వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేస్తే దానికి వెళ్లకుండా డుమ్మా కొట్టి ఢిల్లీ, పంజాబ్, తెలంగాణా సీఎంలు హైదరాబాద్ లో సమావేశం పెట్టుకోవడం దారుణమని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇంచార్జి రావుల రాంనాథ్ అన్నారు. ఆదివారం కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని రాష్ట్రంలో జరిగిన అవినీతి, కుంభకోణాలన్నీ వెలికి తీసి కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపడం ఖాయమన్నారు.
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పోలింగ్ బూతుల వారీగా ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని బీజేపీ భారీ ఎత్తున నిర్వహిస్తోందన్నారు. బీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అమారవేని నర్స గౌడ్, బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ , కిషన్ మోర్చా మండల అధ్యక్షులు ముక్కెర గంగాధర్, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు కర్ణాటక భీమయ్య, కోశాధికారి ధర్మపురి తిరుమలయ్య, బూత్ అధ్యక్షుడు అంకముల గంగాధర్, భూమారెడ్డి, ఐటీ సెల్ మండల కన్వీనర్ బైరి శ్రీనివాస్ దేవేందర్, గంగారాం తదితరులు ఉన్నారు.