సీఎం గో బ్యాక్...వికారాబాద్ లో నిరసన

సీఎం గో బ్యాక్...వికారాబాద్ లో నిరసన

వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద సీఎం గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాఘవన్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాఘవన్ మీడియాతో మాట్లాడుతూ... 12 వందల మంది ఆత్మబలిదానం చేసుకుంటే రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని గుర్తు చేశారు. సీఎం అయిన తర్వాత.. కేసీఆర్ హామీలను విస్మరించారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్లు హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు.

వికారాబాద్ జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఇక్కడకు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలియచేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 16వ తేదీన వికారాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయనకు జడ్పీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఘన స్వాగతం పలికారు. ఎన్నేపల్లిలో ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీకి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.