
ఈ నెల 16 న హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సోమవారం జరగనున్న సభకు జనాన్ని సమీకరించే బాధ్యతను విద్యాశాఖకు అప్పగించారు ఉన్నతాధికారులు. దీనికి సంబంధించి మండలాలు, గ్రామాల నుంచి జనాన్ని తీసుకురావాలని MEO లను ఆదేశించారు కరీంనగర్ జిల్లా విద్యాధికారి. దళితబంధు పథకం ప్రారంభోత్సవం, సీఎం బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి 10 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు DEO. వీళ్లే కాకుండా సభ నిర్వహణ, జనాన్ని తీసుకొచ్చేందుకు 150 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. వీరిలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు.