2016 లో ఓసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. మామిడిపల్లిలో సింబయోసిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ ను ప్రారంభించి హైదరాబాద్ వచ్చారు జైట్లీ. బీజేపీ నేతలతో కలిసి.. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. సీఎం కేసీఆర్.. జైట్లీకి సాదర స్వాగతం పలికారు. జైట్లీ సహా.. బీజేపీ నేతలకు లంచ్ ఇచ్చారు. ఆ సందర్భంగా.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి… కేంద్రం తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణలపైనా జైట్లీ, కేసీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. అప్పటి ఫొటోలు కింద చూడొచ్చు.








