ఏపీలో ముందస్తు ఎన్నికలు.. ?! మోడీతో జగన్ గంట పాటు చర్చలు

ఏపీలో ముందస్తు ఎన్నికలు.. ?! మోడీతో జగన్ గంట పాటు చర్చలు

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్  సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.  2023 జూలై 05 బుధవారం ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్... ప్రధానితో ముందస్తు ఎన్నికల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో చర్చించిన్నట్లుగా ప్రచారం నడుస్తోంది.    

ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాజకీయంగా తనకు మేలు జరుగుతుందనే ఆలోచనలో ఉన్న అధికార వైసీపీ.. అందుకోసం కేంద్రం నుంచి సహకారం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 

సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్ష టీడీపీ ఎప్పటినుంచో భావనలో ఉంది.  అందుకు తగ్గట్టుగానే  తమ వ్యూహాలకు పదును పెడుతుంది.  ఎన్నికలుస ఎప్పుడు వచ్చిన తాము సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు పలు సభల్లో చెబుతూ వస్తున్నారు.