
పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం( జూన్ 6) పరిశీలించారు. తాడేపల్లి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం జగన్ ఏలూరు జిల్లాకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ తిలకించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఈ ఎగ్జిబిషన్ లో అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.
పోలవరంలో పర్యటించిన సీఎం జగన్ ... . నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపై చేశారు. పునరావాసం కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని స్పష్టం చేశారు. 12,658 కుటుంబాలను తరలించామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. పోలవరం వద్ద బ్రిడ్జిని నిర్మించాలని ఆదేశించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ నాటికి ఈ పనుల పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
పనుల పురోగతిపై సమీక్ష
పోలవరం ప్రాజెక్టులో చిన్న సమస్యలను విపత్తుగా చూపించే మీడియా ఏపీలో ఉందని జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనుల పురోగతిని అధికారులు వివరించారు. పోలవరంఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ తిలకించారు. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు
నిధులకు కేంద్రం ఆమోదం
ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రికార్డు సమయంలో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది. గోదావరి నదికి వరద పోటెత్తిన సమయంలో కూడ వరదను తట్టుకొనేలా ఎగువ కాఫర్ డ్యామ్ 44 మీటర్ల ఎత్తుకు పెంచారు. దిగువ కాఫర్ డ్యామ్ ను 31.5 మీటర్ల ఎత్తులో పూర్తి నిర్మించారు. 2021 జూన్ 11న స్పిల్ వే మీదుగా వరద ప్రవాహం మళ్లించారు. దీంతో వరద సమయంలోనూ మెయిన్ డ్యామ్ పనులకు మార్గం సుగమమైంది. మరోవైపు పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు అంగీకారం తెలిపింది. 2013-14 ధరలు కాకుండా ప్రస్తుత ధరల మేరకు నిధులకు ఓకే చెప్పింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థికమంత్రి ఆమోదించినట్లు స్పష్టం చేశారు.
టూరిస్ట్ ప్రాతంగా
పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలని.. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలన్నారు. పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటు కూడా చర్యలు తీసుకోవాలని.. మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు.