ఇయ్యాల్టి నుంచి 3రోజులు కడప జిల్లాలో జగన్ టూర్

ఇయ్యాల్టి నుంచి 3రోజులు కడప జిల్లాలో జగన్ టూర్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. రేపు తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకానున్న ఆయన.. కుటుంబ సభ్యులతో గడుపుతూనే.. ప్రజలతో మమేకమయ్యేలా 3 రోజులు జిల్లాలోనే గడపనున్నారు. రేపు శుక్రవారం వైఎస్ఆర్ ఘాట్ లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. వైఎస్ఆర్ జిల్లాలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో సీఎం జగన్ 3 రోజులు జిల్లాలోనే మకాం వేసి స్థానిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.  

ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు అమరావతిలోని తన నివాసం నుంచి బయలుదేరి 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరిక.  
 
మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరిక. 
 
మధ్యాహ్నం 3.30 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు.
 
మధ్యాహ్నం 3.50 నుంచి 4.05 గంటల వరకు వేల్పుల గ్రామంలో  స్థానిక నాయకులతో మాటామంతీ.

సాయంత్రం 4.10 గంటలకు వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్‌కు  ప్రారంభోత్సవం.

సాయంత్రం 5.35 గంటలకు హెలికాప్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస.

సెప్టెంబర్ 2వ తేదీన కార్యక్రమాలు
 
ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరిక. 

ఉదయం 9గంటల నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు.  
ఉదయం 10 గంటల నుంచి ఇడుపులపాయలోనే మూడు దఫాలుగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 1.30గంటల నుంచి 3 గంటల వరకు, మళ్లీ  3.30 నుంచి 5 గంటల వరకు సమీక్షిస్తారు. 
సాయంత్రం 5.10 గంటలకు గెస్ట్‌హౌస్‌ చేరుకుని రాత్రికి అక్కడే బస. 

సెప్టెంబర్ 3వ తేదీన కార్యక్రమాలు
 
ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9 గంటలకు అక్కడే ఉన్న హెలిప్యాడ్‌ వద్దకు చేరిక. 
ఉదయం 9.15 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరిక. 
ఉదయం 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10 గంటలకు విజయవాడ చేరిక. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని నివాసానికి చేరిక.