కర్నూలు జిల్లాలో 77 చెరువులకు నీళ్లు విడుదల

కర్నూలు జిల్లాలో 77 చెరువులకు నీళ్లు విడుదల

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సుమారు 77  చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.  224.31 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆలంకొండ పంప్ హౌస్ వద్ద హంద్రీనివా ప్రాజెక్ట్ నుంచి.. 159 క్యూసెక్కుల నీటిని తోడి పొలాలకు సాగునీరు అందించనున్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో ఉన్న 77  చెరువులకు నీటిని అందించాలనే ఉద్దేశంతో హంద్రీ నీవా సుజల స్రవంతి.. ప్రధాన కాలువ నుంచి నీటిని మోటార్ల సాయంతో ఎత్తిపోసి నీటిని అందించనున్నారు

ఈ పథకానికి ప్రభుత్వం.. 196 జీఓ ఉత్తర్వులతో జలవనరుల శాఖకు 20 మార్చి 2018న రూ 224.31కోట్లకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా హంద్రీనీవ ప్రదాన కాలువ ఆలంకొండ వద్ద గల పంప్ హౌస్ 90 కి. మీ. వద్ద నుండి 3,800 ఐ మోటార్ల ద్వారా 1.238 టీఎంసీల నీటిని 90 రోజుల్లో పంప్ చేసి.. 5.625 కిలోమీటర్ల దూరంలో కటారుకోండ పై ఉన్నడెలివరి చాంబర్ కు నీరు పంపేలా ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.