
బ్యాంక్ ఫ్రాడ్ కేసులో…. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు …. రతుల్ పురిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ అరెస్ట్ చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 354 కోట్ల రూపాయలు ఎగవేసిన కేసులో రతుల్ పురిని మనీ లాండరింగ్ చట్టం కింద నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ….మోజర్ బేర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతుల్ పురితో పాటు… అతని తండ్రి దీపక్ పురి, ఇతర డైరెక్టర్లు నీతాపురి, సంజయ్ జైన్, వినీత్ శర్మలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి ఆరోపణల కింద వారిపై కేసులు పెట్టారు.