అప్పులు చేశాం..అవసరమైతే ఇంకా చేస్తం: కేసీఆర్

అప్పులు చేశాం..అవసరమైతే ఇంకా చేస్తం: కేసీఆర్

ముస్లీం రిజ్వర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదన్నారు సీఎం కేసీఆర్. అవసరమైతే రాష్ట్ర అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి పంపుతామన్నారు.  కేంద్రం నాన్చుడు ధోరణి వల్లే ముస్లీం రిజర్వేషన్ల ప్రక్రియ జరగడం లేదన్నారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై సీఎం కేసీఆర్ వివరణ సందర్భంగా మాట్లాడారు.  ప్రమాదం  రాష్ట్ర ప్రజలకు కాదు కాంగ్రెస్ కు వస్తోందన్నారు. ఎన్ ఆర్సీపై కేంద్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని..రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో రైలు నిర్మాణంను వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్ర అప్పులు బహిర్గతమన్నారు. రాష్ట్రం చేసిన అప్పుల్ని ఎవరూ దాచలేమన్నారు.  అవసరమైతే ఇంకా అప్పులు చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ఎస్ ఎల్ బీసీ 40 ఏళ్లైనా ఎందుకు పూర్తి చేయలేదన్నారు.