జిల్లా కలెక్టర్లు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ గజ్వేల్ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టకు ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, అధికారులతో కలిసి రెండు ప్రత్యేక బస్సుల్లో బయలు దేరారు. కోమటిబండ గుట్టపై నిర్మించిన మిషన్ భగీరథ పంపుహౌస్ ను సందర్శించారు. కోటి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మాణమైన ఈ భారీ పంప్ హౌస్ నుంచి … 456 గ్రామాలకు ప్రతిరోజూ తాగునీరు సరఫరా జరుగుతోంది. 5 ఎకరాల్లో నిర్మించిన భగీరథ కేంద్రాన్ని మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు కేసీఆర్. పథకం పనితీరును వివరించనున్నారు.
సీఎం టూర్ సందర్భంగా కోమటిబండలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పంప్ హౌస్ వరకు ప్రత్యేక రోడ్డు నిర్మించారు. పంప్ హౌస్ దగ్గర కొత్తగా నిర్మించిన… మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే హరితహారం, మిషన్ భగీరథపై… మంత్రులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తారు. కోమటిబండ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు.
