ఢిల్లీ ప్రభుత్వంపై కేసీఆర్ ప్రశంసలు

ఢిల్లీ ప్రభుత్వంపై కేసీఆర్ ప్రశంసలు

ఢిల్లీ విద్యా విధానం దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ అన్నారు. దేశమంతటా ఢిల్లీ తరహా ఎడ్యుకేషన్ సిస్టం ఉండాలని ఆకాంక్షించారు. కానీ కేంద్రం తెచ్చిన కొత్త విధానం ఏకపక్షంగా ఉందన్న కేసీఆర్.. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఢిల్లీ తరహా విధానాన్ని అమలు చేయకపోయినా.. తెలంగాణ టీచర్లను ఢిల్లీకి పంపి ఓరియెంటేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరోవైపు దేశంలో సంచలనం రావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. అది తప్పకుండా వస్తుందని చెప్పారు. రాజకీయాల్లో ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలని అన్నారు

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో కలిసి సర్వోదయ పాఠశాల, మొహల్లా క్లినిక్ లను సందర్శించారు. తొలుత దక్షిణ మోతీబాగ్ లో ఉన్న సర్వోదయ పాఠశాలకు చేరుకున్న సీఎం కేసీఆర్ పాఠశాలలో  సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూపొందించిన ఓ డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్ బృందం తిలకించింది. పాఠశాలలోని వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అక్కడి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం కేసీఆర్ బృందం మొహల్లా క్లినిక్ ను సందర్శించింది.

మరిన్ని వార్తల కోసం : -

12వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన అఖిలేష్