రాజ్యాంగం ,న్యాయస్థానాల పై సీఎం కేసీఆర్ కు ఏమాత్రం గౌరవం ఉన్నా శాసనసభ కు, హైకోర్టు కు, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు CLP నేత భట్టి విక్రమార్క. ప్రజలను ,హైకోర్టు ను, శాసనసభ ను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన అన్నారు. గురువారం ఆసెంబ్లీ మీడియా హాల్ ఆయన మాట్లాడుతూ.. వేల మంది కార్మికుల సమ్మె కు ముగింపు చెప్పాల్సిన ప్రభుత్వం… సమ్మె ను ఆసరా గా చేసుకొని ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని భట్టి అన్నారు. రూట్లను ప్రైవేటీకరిస్తున్నామంటున్న ప్రభుత్వ తీరు అత్యంత ప్రమాదకరమని అన్నారు. 5100 రూట్ల ను ప్రైవేటీకరించడం అంటే ..ఆర్టీసీ లో సగం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లేనని అన్నారు. ప్రైవేటు బస్సు లను ఆర్టీసీ తీసుకొని నడిపింది కానీ ఎప్పుడు రూట్లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదన్నారు భట్టి.
ప్రజా స్వామ్య వ్యవస్థ లో ఆస్తులను ప్రభుత్వం ప్రజల కోసం సృష్టించాలి…కానీ ఈ ప్రభుత్వం ఆస్తులను అమ్ముతున్నదని ఎమ్మెల్యే భట్టి అన్నారు.గత ప్రభుత్వాలన్ని ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుంటూ వస్తే..ఈ ప్రభుత్వం అమ్మకానికి పెడుతుందన్నారు. ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మొద్దని సీఎం కు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
గతంలో రవాణా వ్యవస్థ మాఫియా గా ఉండేదని.వారే ప్రజలను ,రాజకీయాలను శాసించేవారన్నారు భట్టి. అలాంటి మాఫియా కు అడ్డుకట్ట వేసి రూట్ల ను జాతీయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఉధ్యమించి తెచ్చుకున్న తెలంగాణ ను కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరి పై ఉందని, ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్ బండ్ పిలుపుకు మా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.

