హైదరాబాద్: ప్రధాని మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ తో పాటు ఆయన ఫ్యామిలీ సభ్యులు చప్పట్లు కొట్టారు. జనతా కర్ఫ్యూలో.. పోలీసులు, జర్నలిస్టులు, డాక్టర్లు, ఫైర్ సిబ్బంది.. దేశానికి వీరు చేస్తున్న సేవలకు గానూ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో చప్పట్లు కొట్టారు.
కరోనా కట్టడి కోసం చేపట్టిన ఈ కర్ఫ్యూను రాష్ట్రంలో 90శాతం మంది పాటించినట్లు పోలీసులు తెలిపారు. అటు ఏపీ సీఎం జగన్, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా చప్పట్లు కొట్టి సంఘీభావ తెలిపారు.
