
చంద్రయాన్ 2 తర్వాత ఇస్రో ప్రతిష్టాత్మకంగ చేపట్టిన ప్రయోగం పీఎస్ఎల్వీ సీ47. శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ47 విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ47ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ ప్రయోగం మన శాస్త్రవేత్తల కృషికి మరో విజయమని శాస్త్రవేత్తల బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.
కార్టోశాట్ 3 మరియు 13 అమెరికా శాటిలైట్లను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ47.. మిలటరీకి బాగా పనికొస్తుందని ఇస్రో చైర్మన్ శివన్ అన్నారు. కార్టోశాట్ ద్వారా భూమిని అణువణువునా జల్లెడ పట్టవచ్చని ఆయన తెలిపారు. కార్టోశాట్ 3 ద్వారా అత్యంత ఎక్కువ రెజల్యూషన్‌తో స్పష్టమైన ఫోటోలు తీయోచ్చని ఆయన తెలిపారు.