శ్రీరాముని జీవితం త‌ర‌త‌రాల‌కు ఆద‌ర్శం : సీఎం కేసీఆర్ 

శ్రీరాముని జీవితం త‌ర‌త‌రాల‌కు ఆద‌ర్శం : సీఎం కేసీఆర్ 

రాష్ట్ర, దేశ ప్రజ‌ల‌కు తెలంగాణ  సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సీతారామ‌చంద్రమూర్తుల‌ను త‌మ ఆరాధ్య దైవాలుగా, ఇల‌వేల్పుగా హిందువులు కొలుచుకుంటార‌ని తెలిపారు. శ్రీరాముని  జీవితం త‌ర‌త‌రాల‌కు ఆద‌ర్శం, స్ఫూర్తిదాయ‌కం. ఆద‌ర్శవంత‌మైన జీవ‌నాన్ని కొన‌సాగించేందుకు శ్రీరామ న‌వ‌మి ఒక ప్రత్యేక సంద‌ర్భం అని తెలిపారు. రాష్ట్రంతో పాటు యావ‌త్ భార‌త‌దేశం సుభిక్షంగా వ‌ర్ధిల్లాల‌ని, ప్రజ‌లంద‌రూ సుఖ‌శాంతుల‌తో జీవించాల‌ని ప్రార్థిస్తున్నా అని కేసీఆర్ అకాంక్షించారు.  భద్రాచలంలో   సీతారాముల వారి క‌ళ్యాణ వేడుక‌ల‌ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, వైభ‌వోపేతంగా నిర్వహిస్తుంద‌న్నారు.