
హైదరాబాద్: కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే సీఎం కేసీఆర్ పాత సెక్రటేరియట్ ను కూల్చి వేశారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. మూడనమ్మకాల కోసమే సచివాలయం, గుడి, మసీదు కూల్చివేసారన్నారు. కరోనా సమయంలో ఎందుకు కూల్చడం అని చెప్పిన వినలేదని, చారిత్రక భవనాలను సీఎం కూలకొట్టారన్నారు. .
సెక్రటేరియట్ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఫారెస్ట్ యాక్ట్ ,పర్యావరణ చట్టం ప్రకారం అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టారదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు రేవంత్ . ప్రస్తుత యాక్ట్ లలో కూడా అంశం ఉందని, హుస్సేన్ సాగర్ చుట్టూ శాశ్వత నిర్మాణాలు చేపట్టారదని 2001 లో హై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న భవానాలన్ని అక్రమ నిర్మాణాలు అని చెప్పి 2005 లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. ప్రస్తుత చట్టాల ప్రకారం పాత సెక్రటేరియట్ కూల్చిన దగ్గర మళ్ళీ కొత్త సెక్రటేరియట్ కట్టడానికి వీలు లేదని చెప్పారు.
అధికార దుర్వినియోగం చేస్తూ చీఫ్ సెక్రటరీ, డీజీపీ సెక్రటేరియట్ ను కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. గుళ్లను కూల్చివేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత మ్యాప్‌లు మాయం చేసి.. కొత్త మ్యాప్‌లతో ఎన్జీటీ బృందాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో ఉన్న బ్రిటీష్ లైబ్రరీలో పాత మ్యాప్ ఉందని వెల్లడించారు. కేసీఆర్ ఇస్తున్న దొంగ మ్యాప్‌లు నమ్మొద్దని 1920లో బ్రిటిష్ వారు తయారు చేసిన హైదరాబాద్ మ్యాప్ ఇచ్చినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
కొత్త సెక్రటేరియట్ కు అనుమతి ఇచ్చిన జీహెచ్ఎమ్‌సీ, హెచ్ఎమ్‌డీఏ పై కూడా ఎన్జీటీకి ఫిర్యాదు చేశానని చెప్పారు రేవంత్ . సెక్రటేరియట్ కేసీఆర్ జన్మస్థలం ఎర్రగడ్డలో కట్టుకున్నా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. దానితో పాటు గుళ్లు, గోపురాలు కులకొట్టినా వారిపై కూడా పిర్యాదు చేశానన్నారు. ఎన్జీటీ ద్వారా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు కు వెళతానని చెప్పారు.