మినిస్టర్లతో సీఎం అర్జెంట్​ మీటింగ్.. ఈటలకు రాని పిలుపు!

మినిస్టర్లతో సీఎం అర్జెంట్​ మీటింగ్.. ఈటలకు రాని పిలుపు!
  • ఉన్నట్టుండి ప్రగతి భవన్ ​నుంచి కొందరు మినిస్టర్లకు ఫోన్లు
  • వెంటనే రావాలంటూ ఆదేశాలు.. వారితో కలిసి సీఎం లంచ్​
  • పలు అంశాలపై మంత్రులతో చర్చ
  • అందుబాటులో ఉన్నా ఈటలకు మాత్రం నో ఇన్ఫర్మేషన్
  • ‘మీటింగ్​ ఎందుకో తెలియదు.. నన్ను పిలవలేదు’ అన్న ఈటల
  • కరీంనగర్​ జిల్లాకే చెందిన గంగులకు మాత్రం పిలుపు

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​ సడీ సప్పుడు లేకుండా కొందరు మినిస్టర్లతో అర్జంట్​ మీటింగ్​ పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ప్రగతిభవన్​లో హడావుడిగా భేటీ అయ్యారు. వారితో కలిసి మధ్యాహ్నం లంచ్​ చేసి, పలు రాజకీయ అంశాలపై చర్చలు జరిపారు. కానీ సీనియర్​ మినిస్టర్​ అయిన ఈటల రాజేందర్​ను మాత్రం మీటింగ్​కు పిలవలేదు. ఇది టీఆర్ఎస్​లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ల నేపథ్యంలో భేటీ జరిగిందని, అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచారని నేతలు పైకి చెప్తున్నా.. మరేదో ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మధ్య వరుసగా ఎలక్షన్లలో ఎదురుదెబ్బలు తినడం, కేటీఆర్​ను సీఎం చేస్తారనే ప్రచారాలు, సొంత లీడర్లపై కేసీఆర్​ అగ్గిమీద గుగ్గిలమైన తీరు వంటివాటి నేపథ్యంలో.. ఇప్పుడీ అర్జంట్​ మీటింగ్ ​ప్రాధాన్యం సంతరించుకుంది. ఈటలకు ప్రగతిభవన్ కు మధ్య దూరం పెరిగిందని.. ఈ మీటింగ్  ద్వారా మంత్రుల్లో తన వారెవరు, పరాయి వారెవరన్న దానిపై సీఎం క్లారిటీ ఇచ్చారని టీఆర్ఎస్​ లీడర్లలో ప్రచారం గుప్పుమన్నది. శుక్రవారం పొద్దున పదిన్నర టైంలో సీఎం కేసీఆర్​ ఫామ్ హౌజ్ నుంచి ప్రగతిభవన్ కు చేరుకున్నారు. కాసేపటికి కొందరు మంత్రుల పేర్లు చెప్పి వారిని అర్జంట్ గా ప్రగతిభవన్​కు పిలవాలని ఆదేశించారు. ప్రగతిభవన్  వర్గాలు వెంటనే సంబంధిత మినిస్టర్లకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్​ ఇచ్చాయి. కాల్స్ వచ్చిన పది మంది మంత్రులు హడావుడిగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఇన్విటేషన్ రానివారు తమకు ఎందుకు ఫోన్ రాలేదని ఆరా తీశారని.. ప్రగతిభవన్ నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిసింది.

ఈటల దగ్గర్లోనే ఉన్నా..

అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచామని ప్రగతిభవన్​ వర్గాలు చెప్పుకొస్తున్నా.. పరిస్థితి మరోలా ఉందని నేతలు అంటున్నారు. ఈటల ఉదయం నుంచీ హైదరాబాద్​లోనే ఉన్నారు. ప్రగతి భవన్​కు కూతవేటు దూరంలోని టెంపరరీ సెక్రటేరియట్​ బీఆర్కే భవన్​లోనే పొద్దంతా గడిపారు. అయినా ఆయనకు సీఎం మీటింగ్​పై కనీసం ఇన్ఫర్మేషన్​ లేదు. అయితే ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకే చెందిన మంత్రి గంగుల కమలాకర్ కు మాత్రం సీఎం పిలుపు అందింది. ప్రగతిభవన్​ మీటింగ్ కు ఎందుకు వెళ్లలేదని మీడియా ప్రతినిధులు ఈటల వద్ద ప్రస్తావించగా.. ‘‘మీటింగ్ ఎందుకోసమో తెలియదు. నన్ను పిలవలేదు. పిలిస్తే వెళ్లేవాడిని కదా..’ అని సమాధానం ఇచ్చారు.

ఈటలపై గరంగరం!

‘ఈటలకు పదవి ఉంది తప్పితే పవర్​ లేదు. ఆయన మాట ఆఫీసర్లు కూడా వినడం లేదు. హెల్త్  డిపార్ట్​మెంట్​కు చెందిన పనులను నేరుగా ప్రగతి భవన్ నుంచే మానిటరింగ్ చేస్తారు. చివరికి బడ్జెట్ ప్రపోజల్స్ కూడా ఆయనకు తెలియకుండానే ఆఫీసర్లు తయారు చేసి పంపారు’’ అని ఓ ఎమ్మెల్యే అన్నారు. కొంతకాలంగా ఈటలను కేసీఆర్ విశ్వసించడం లేదన్న ప్రచారం ఉందని.. ఇటీవల టీఆర్ఎస్ ​భవన్​లో కేసీఆర్​ గరం గరం కావటం కూడా పరోక్షంగా ఈటలను ఉద్దేశించిందేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం ఇంట్లో మినిస్టర్ల లంచ్​కు ఈటలను పిలవకపోవడం కలకలం రేపుతోంది.

కొందరికి ప్రయారిటీ ఇచ్చి..

సీఎం ప్రగతిభవన్ మీటింగ్ సందర్భంగా.. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఇన్‌చార్జులను నిర్ణయించారు. కొందరు మంత్రులకు ప్రయారిటీ ఇచ్చారు. ఈటలను మీటింగ్‌కు పిలవని సీఎం.. అదే కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ను హైదరాబాద్ ఇన్‌చార్జిగా నియమించారు. చాలా రోజులుగా
సిద్దిపేటకే పరిమితమైన హరీశ్ రావుకు కూడా కీలకమైన రంగారెడ్డి జిల్లా బాధ్యత, మంత్రి ప్రశాంత్ రెడ్డికి మహబూబ్‌నగర్ ఇన్చార్జి బాధ్యత ఇచ్చారు.
సీఎం మీటింగ్‌కు గంగుల, హరీశ్ రావుతోపాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లా రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కేకే హాజరయ్యారు. ఎలక్షన్లు జరిగే జిల్లాల్లోని మంత్రులతో సమన్వయం చేసుకుంటూ టీఆర్ఎస్ క్యాండిడేట్​ వాణిదేవిని
గెలిపించాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు పార్టీ ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి ఏమేం చేయాలన్నది వివరించినట్టు తెలిసింది.

మళ్లీ హరీశ్​కు బాధ్యతలు

కొంతకాలంగా మంత్రి హరీశ్ రావును కేవలం ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలకే పరిమితం చేశారు. గ్రేటర్​ హైదరాబాద్​ ఎలక్షన్ల టైంలో కూడా ఉమ్మడి మెదక్​ జిల్లా పరిధిలోని పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న డివిజన్లకు మాత్రమే ఎన్నికల బాధ్యత అప్పగించారు. అలాంటిది ఇప్పుడు చాలా కాలం తర్వాత హరీశ్ రావుకు వేరే జిల్లాలకు చెందిన రాజకీయ బాధ్యతలు అప్పగించారని పార్టీ లీడర్లు చెప్పుకొంటున్నారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో బీజేపీ పెద్ద మొత్తంలో సీట్లు గెలుచుకుంది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ సీట్లో మళ్లీ విజయం సాధించేందుకు ప్లాన్ చేసింది. ఇలాంటి సమయంలో హరీశ్ రావుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాధ్యతలు అప్పగించడంతో.. ఆయనకు మళ్లీ ప్రయారిటీ ఇచ్చారని ఓ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

శుక్రవారం పొద్దున పదిన్నర టైంలో సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు . కాసేపటికి కొందరు మంత్రుల పేర్లు చెప్పి వారిని అర్జంట్‌గా ప్రగతిభవన్‌కు పిలవాలని ఆదేశించారు. ప్రగతిభవన్ వర్గాలు వెంటనే సంబంధిత మినిస్టర్లకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. కాల్స్ వచ్చిన పది మంది మంత్రులు హడావుడిగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఇన్విటేషన్ రానివారు తమకు ఎందుకు ఫోన్ రాలేదని ఆరా తీశారని.. ప్రగతిభవన్ నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిసింది.

ఈటల దగ్గర్లోనే ఉన్నా..
అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచామని ప్రగతిభవన్ వర్గాలు చెప్పుకొస్తున్నా.. పరిస్థితి మరోలా ఉందని నేతలు అంటున్నారు. ఈటల ఉదయం నుంచీ హైదరాబాద్​లోనే ఉన్నారు. ప్రగతి భవన్‌కు కూతవేటు దూరంలోని టెంపరరీ సెక్రటేరియట్ బీఆర్కే భవన్‌లోనే పొద్దంతా గడిపారు. అయినా ఆయనకు సీఎం మీటింగ్ పై కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన మంత్రి గంగుల కమలాకర్‌కు మాత్రం సీఎం పిలుపు అందింది. ప్రగతిభవన్ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదని మీడియా ప్రతినిధులు ఈటల వద్ద ప్రస్తావించగా.. ‘‘మీటింగ్ ఎందుకోసమో తెలియదు. నన్ను పిలవలేదు. పిలిస్తే వెళ్లే వాడిని కదా..’ అని సమాధానం ఇచ్చారు.

ఈటలపై గరంగరం!
‘ఈటలకు పదవి ఉంది తప్పితే పవర్ లేదు. ఆయన మాట ఆఫీసర్లు కూడా వినడం లేదు. హెల్త్ డిపార్ట్​మెంట్‌కు చెందిన పనులను నేరుగా
ప్రగతి భవన్ నుంచే మానిటరింగ్ చేస్తారు. చివరికి బడ్జెట్ ప్రపోజల్స్ కూడా ఆయనకు తెలియకుండానే ఆఫీసర్లు తయారు చేసి పంపారు’’ అని ఓ ఎమ్మెల్యే అన్నారు. కొంతకాలంగా ఈటలను కేసీఆర్ విశ్వసించడం లేదన్న ప్రచారం ఉందని.. ఇటీవల టీఆర్ఎస్ భవన్‌లో కేసీఆర్ గరం గరం కావటం కూడా పరోక్షంగా ఈటలను ఉద్దేశించిందేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం ఇంట్లో మినిస్టర్ల లంచ్‌కు ఈటలను పిలవకపోవడం కలకలం రేపుతోంది.