ప్రగతిభవన్​లో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్

ప్రగతిభవన్​లో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్
  • ప్రగతిభవన్​లో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్
  • హరీశ్ రావును అర్జెంట్​గా పిలిపించుకున్న కేసీఆర్​
  • కేటీఆర్, వినోద్​కుమార్,  దామోదర్​రావు కూడా హాజరు
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ భేటీ

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో ఎమర్జెన్సీ మీటింగ్​నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ప్లానింగ్​ బోర్డు వైస్​చైర్మన్ వినోద్​ కుమార్, రాజ్యసభ ఎంపీ దామోదర్​రావులతో పాటు ఇద్దరు ముగ్గురు సీనియర్ లీడర్లు మాత్రమే ఈ మీటింగ్ కు హాజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది. ఆదిలాబాద్​ జిల్లాలో మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్న హరీశ్​రావుకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ అర్జెంట్​గా ప్రగతిభవన్​కు పిలిపించుకున్నట్టు తెలిసింది. చందనవెల్లిలో వెల్​స్పన్ ఇండస్ట్రీ ఓపెనింగ్​ పూర్తికాగానే కేటీఆర్​నూ రమ్మన్నట్లు సమాచారం. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం గురించి బీఆర్​ఎస్​ పార్టీ వర్గాలుగానీ.. సీఎంవో అధికారులుగానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, ఎలక్షన్​ ఏడాది కావడంతో ప్రభుత్వ ప్రధాన హామీలైన రైతుబీమా, సొంత జాగాల్లో డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, దళితబంధు వంటి వాటిపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల పెర్ఫార్మెన్స్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉండొచ్చనేది సీఎం కేసీఆర్​ నేతలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.