మోడీ, ఆర్థికమంత్రిపై కేసీఆర్ గుస్సా

మోడీ, ఆర్థికమంత్రిపై కేసీఆర్ గుస్సా

దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్పై స్పందించిన ఆయన.. మోడీ, ఆర్థిక మంత్రితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్ముడం, మత పిచ్చి పెంచడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రానికి మెదడు లేదన్న కేసీఆర్.. దరిద్రపుగొట్టు సోషల్ మీడియాతో పచ్చి అబద్దాలు ప్రచారం చేయడం మాత్రమే బీజేపీకే తెలుసని విమర్శించారు. కేంద్రం వైఖరి కారణంగానే గంగానదిలో శవాలు తెలుతున్నాయని విమర్శించారు.

కురసబుద్ధి ప్రధాని మోడీ
బ్లాక్ మనీగాళ్లను దేశం నుంచి బయటకు పంపిన ఘనత మోడీ సొంతమని కేసీఆర్ విమర్శించారు. మోడీలాంటి కురసబుద్ధి ఉన్న ప్రధానిని ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. మోడీ గుజరాత్కే మాత్రమే ప్రధానిలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత మోడీ బండారం బయటపడిందన్న కేసీఆర్.. హైదరాబాద్ లో అర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే మోడీకి నిద్రపట్టడంలేదని అన్నారు. ఎయిర్ఇండియాను అమ్మిన ప్రధాని, ఎల్ఐసీని కూడా అమ్మకానికి పెట్టడంపై కేసీఆర్ మండిపడ్డారు.

ఆత్మద్రోహం చేసుకుంటున్న ఆర్థికమంత్రి
శాంతి శ్లోకం చదివిన నిర్మలా సీతారామన్ ఆత్మద్రోహం చేసుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. సిగ్గులేకుండా మహాభారతంలోని శాంతి పర్వ శ్లోకాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. శాంతిమంత్రం చెప్పి అధర్మపు పనులు చేసిన ఘనత ఆర్థికమంత్రికే దక్కుతుందని విమర్శించారు. నిర్మలా సీతారామన్ ఆత్మవంచన చేసుకుని దేశప్రజలను వంచించారని కేసీఆర్ మండిపడ్డారు

317జీవోపై మాట్లాడేవారి లాగు పగలగొట్టాలి
317 జీవోపై రాష్ట్ర బీజేపీ నేతలు పోరాటం చేస్తామనడంపై కేసీఆర్ ధ్వజమెత్తారు. అసలు ఆ జోవోలో ఏముందో బీజేపీ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. స్థానికులకు 95శాతం ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతోనే 317 జీవో తెచ్చామని చెప్పారు. ఎక్కడి వారికి అక్కడే ఉద్యోగాలు రావాలనే కొత్త జిల్లాలు, జోన్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిపాలన తెలియని వారు 317 జీవోపై సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కొందరు స్వార్థపరులైన ఉద్యోగులు మాత్రమే జీవోను వ్యతిరేకిస్తున్నారని, 317 జీవో గురించి మాట్లాడితే లాగు పగులకొట్టాలని పిలుపునిచ్చారు.