సీఎం కేసీఆర్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. ఆయన వ్యక్తిగత డాక్టర్ MV రావు ఆధ్వర్యంలోని డాక్టర్ల టీమ్ సీఎంకు టెస్టులు చేశారు. రాపిడ్ యాంటిజెన్ టెస్టులో కేసీఆర్ కు నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. రేపు RTPCR రిపోర్ట్ వస్తుందని చెప్పారు. ఈనెల 19న కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన ఎర్రవెల్లి ఫాంహౌజ్ లోనే ఐసోలేషన్ ఉన్నారు సీఎం. 21న సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు వచ్చి టెస్టులు చేయించుకున్నారు కేసీఆర్. తర్వాత ఫాంహౌజ్ వెళ్లిన సీఎం.. అప్పటినుంచి పర్యవేక్షణలో ఉంటున్నారు. ఇవాళ కేసీఆర్ కు రాపిడ్ యాంటిజెన్ టెస్టు చేయగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు డాక్టర్లు. రేపు RTPCR రిజల్ట్ వస్తుందని చెప్పారు.
