సోదర భావాన్ని పెంచే పండుగ రాఖీ

సోదర భావాన్ని పెంచే పండుగ రాఖీ

హైదరాబాద్, వెలుగు: రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై గ్రీటింగ్స్ తెలిపారు. మానవ సంబంధాల్లో సోదర భావాన్ని పెంచే పండుగ రాఖీ అని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కా చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లు అండగా ఉంటారన్న భరోసా ఈ పండుగలో ఇమిడి ఉన్నదని తెలిపారు. సోదర భావం, ప్రేమాభిమానాలతో ఏటా శ్రావణ మాసం పౌర్ణమినాడు జరుపుకునే ఈ పండుగ దేశ సంస్కృతి, సంప్రదాయాల్లో అనాదిగా వస్తోందని గుర్తుచేశారు.

ప్రజల మధ్య సోదర భావం మరింత పెరగాలని ఆకాంక్షించారు. అక్కాచెల్లెలు, అన్నదమ్ముల మధ్య శాశ్వతమైన బంధాన్ని చాటి చెప్పే పండుగ రాఖీ అని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రేమ, బాధ్యతతో తమ అక్కా చెల్లెలను అన్నదమ్ములు కాపాడుకోవాలని సూచించారు. ఈ పండుగను ఆజాది కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తితో జరుపుకుందామన్నారు.