రైతులకు గుడ్ న్యూస్..కేసీఆర్ కీలక నిర్ణయం

రైతులకు గుడ్ న్యూస్..కేసీఆర్ కీలక నిర్ణయం

రాష్ట్ర రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాట్లు, కార్యాచరణ చర్యలు చేపట్టాలని సూచించారు. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది 7 వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి  ధాన్యాన్ని సేకరిస్తోంది. ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తోంది.  అయితే వరి ధాన్యంకు  ఈ సారి గ్రేడ్‌ వన్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది.