నిజం ఏంటీ : ప్రగతిభవన్ కు సున్నం కొట్టిస్తున్న సీఎం కేసీఆర్..

నిజం ఏంటీ : ప్రగతిభవన్ కు సున్నం కొట్టిస్తున్న సీఎం కేసీఆర్..

తెలంగాణ సీఎం అధికారిక నివాసం అయిన ప్రగతిభవన్ కు కొత్తగా సున్నం కొడుతున్నారు. మరికొన్ని గంటల్లో.. అంటే డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో.. మరికొన్ని గంటల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే.. ప్రజాతీర్పు వస్తున్న సమయంలో.. ప్రగతిభవన్ కు కొత్తగా సున్నం కొట్టించటం ఏంటనే చర్చ నడుస్తుంది. అయితే ఈ ఫొటోలు కొత్తవా.. పాతవా.. గతంలో పెయింటింగ్ జరిగిన ఫొటోలా అనేది మాత్రం క్లారిటీ లేదు. 

డిసెంబర్ 2వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రగతిభవన్ కు రంగులు వేయిస్తున్న ఫొటో బయటకు రావటం ఆసక్తిగా మారింది. అన్ని ఎగ్జిట్ పోల్స్.. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెబుతున్నాయి. ఇదే జరిగితే కేసీఆర్.. ప్రగతిభవన్ ఖాళీ చేయాల్సి ఉంటుంది.. ఇలాంటి చర్చ నడుస్తున్న సమయంలో.. రీ పెయింటింగ్ వేయటం.. పది మంది పెయింటర్లు.. సున్నం కొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ ఫొటో ఇప్పుడు తీసిందా.. గతంలో తీసింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఎగ్జిల్ పోల్ సర్వేల ప్రకారం.. కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేస్తున్నట్లు ప్రచారం జరగటంతోపాటు.. సోషల్ మీడియాలో జోరుగా డిస్కషన్ నడుస్తుంది.. ఈ క్రమంలోనే.. ప్రగతిభవన్ కు కొత్తగా రంగులు వేస్తున్న ఫొటోలు బయటకు రావటం ఆసక్తిగా మారింది.. జనంలో చర్చనీయాంశం అయ్యింది. 

ఫొటో ఎప్పటిది అయినా.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలకు కనెక్ట్ అవ్వటంతో.. వైరల్ గా మారింది ఫొటో..